Another Hero From Nandamuri Family : తెలుగు సినీ పరిశ్రమ (Telugu Cine Industry) లో నందమూరి ఫ్యామిలీ (Nandamuri Family) కి భారీ గుర్తింపు ఉంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి తర్వాత ఆయన కుమారులు బాలకృష్ణ, హరికృష్ణ హీరోలుగా మెప్పించగా.. ఇప్పుడు బాలయ్యతో పాటూ హరికృష్ణ వారసులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలో హీరోలుగా భారీ స్టార్ డం తో కొనసాగుతున్నారు.
ఇక ఇప్పుడు ఇదే ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని ఒకప్పటి స్టార్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి (YVS Chowdary) అధికారికంగా ప్రకటించారు. తన భార్య గీత నిర్మాతగా న్యూ టాలెంట్ రోర్స్ (New Talent Roars (@NTR)) అనే కొత్త బ్యానర్‌ను వైవీఎస్ ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై రానున్న తొలి సినిమాతోనే నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగోతరం హీరోను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : జాలి, దయ పదాలకు అర్థమే తెలియని అసురుడు.. ఊరమాస్ గా బాలయ్య బర్త్ డే గ్లింప్స్!
హీరోగా హరికృష్ణ మనవడు...
"సీనియర్ ఎన్టీఆర్ మునిమనవడు.. హరికృష్ణ మనవడు.. దివంగత జానకిరామ్ పెద్ద కుమారుడు నందమూరి తారక రామారావును నేను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నందుకు గర్వంగా ఉంది. హరికృష్ణతో సినిమాలు తీసే అదృష్టం నాకు దక్కింది. ఇప్పుడు ఆయన మనవడిని కూడా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నా" అని వైవిఎస్ చౌదరి ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.
నందమూరి తారక రామారావు అనే నాలుగవ తరం పేరుని ప్రపంచానికి పరిచయం చెయ్యడం నా అదృష్టంగా భావిస్తున్నాను.#YVSChowdary introducing Nandamuri Janaki Ram's son NANDAMURI TARAKA RAMARAO under his new banner NewTalentRoars@ with his wife #YalamanchiliGeetha as Producer. pic.twitter.com/6mi6vAZtDI
— Gulte (@GulteOfficial) June 10, 2024