Delhi Elections 2025: ఢిల్లీలో బోణీ కొట్టిన బీజేపీ!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. అయితే బీజేపీ మొదటి విజయం సాధించింది. విశ్వాస్ నగర్ అసెంబ్లీ స్థానం పోటీ చేసిన అభ్యర్థి ఓం ప్రకాశ్ శర్మ విజయం సాధించారు.
Delhi Election Results 2025: ఆప్ ను చీపిరితో ఊడ్చేశాం.. నెక్స్ట్ తెలంగాణే మా టార్గెట్: బండి సంజయ్ సంచలనం!
ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారన్నారు. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీనే విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Delhi Election 2025 Results: ఢిల్లీలో కాంగ్రెస్ ఖతం కావడానికి కారణాలు ఇవే!
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో కొనసాగుతోంది. అయితే ఒకప్పుడు నాలుగు సార్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుంచి ఒక స్థానం కూడా గెలవడంలేదు. అమలు చేయలేని హామీలు, ప్రచారం చేయకపోవడం వంటివి కాంగ్రెస్ పతనానికి కారణాలని చెప్పవచ్చు.
UP MILKIPUR BY ELECTION 2025: యూపీలోనూ కమలమే.. ఉప ఎన్నికల్లో దూసుకుపోతున్న బీజేపీ!
ఢిల్లీతో పాటు యూపీలోనూ బీజేపీ ప్రభంజనమే కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో ప్రీఫైనల్ గా భావించిన మల్కీపూర్ బై ఎలక్షన్ లో బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాస్వాన్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. సర్వశక్తులు ఒడ్డినా సమాజ్ వాదీ పార్టీకి మళ్లీ నిరాశే మిగిలే ఛాన్స్ఉంది.
Delhi Elections Counting: ఢిల్లీలో అధికారం దిశగా బీజేపీ.. వెనుకబడ్డ ఆప్.. కౌంటింగ్ లైవ్ అప్డేట్స్!
ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఆప్ కేవలం 25 సీట్లలోనే ముందంజలో ఉంది. అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, అతిషి, మనీష్ సిసోడియా సైతం పోస్టల్ బ్యాలెట్ లో వెనుకడడం ఆప్ ను కలవర పెడుతోంది.