/rtv/media/media_files/2025/02/08/WtIJtIpOcz3e83ffiEiZ.jpg)
Bandi Sanjay Comments on Delhi Election Results
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారన్నారు. ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను డిల్లీ ప్రజలు కోరుకున్నారన్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దు అనుకున్నారన్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించిందేనన్నారు. మేధావి వర్గం అంతా బీజేపీకే ఓటు వేశారన్నారు. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీనే విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మేధావి వర్గం, ఉద్యోగ ఉపాధ్యాయులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. శాసనసభలో మీ సమస్యలను ప్రశ్నించేది బీజేపీ ఒక్కటేనన్నారు.
Follow Us