Central Govt Debt: ఈ ఏడాదిలో రూ.185 లక్షల కోట్లకు దేశ అప్పు: కేంద్రం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ అప్పు.. విదేశీ రుణాలతో కలుపుకొని రూ.185 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్రం అంచనా వేసింది. ఇది దేశ జీడీపీలో 56.8 శాతానికి సమానమని తెలిపింది. 2024 మార్చి చివరి నాటికి కేంద్రం అప్పు రూ.171.78 లక్షల కోట్లుగా ఉందని పేర్కొంది.