Indore : ప్రాణాలు తీసిన వీడియో కాల్ ప్రాంక్
ఇండోర్‌లో విద్యార్ధి ప్రాంక్ సరదా ప్రాణాలను తీసింది. ఉరి వేసుకుంటున్నట్టు నటించి ఫ్రెండ్స్‌ను ఏప్రిల్ ఫూల్ చేద్దామనుకున్న అతని ప్లాన్ రివర్స్ అయి అతని లైఫ్‌నే ఎండ్ చేసింది.
ఇండోర్‌లో విద్యార్ధి ప్రాంక్ సరదా ప్రాణాలను తీసింది. ఉరి వేసుకుంటున్నట్టు నటించి ఫ్రెండ్స్‌ను ఏప్రిల్ ఫూల్ చేద్దామనుకున్న అతని ప్లాన్ రివర్స్ అయి అతని లైఫ్‌నే ఎండ్ చేసింది.
కెనడాలోని ఒంటారియాలో భారత సంతతికి చెందిన ఫ్యామిలీ అనుమానాస్పదంగా మృతి చెందారు. కుటుంబంలోని దంపతులు, కుమార్తె అందరూ ఒకేసారి చనిపోవడం అనుమానాలకు దారితీస్తోంది. కొన్ని రోజుల క్రితం వారింటికి మంటలు అంటుకుని ముగ్గూరు ఒకేసారి సజీవదహనమయ్యారు.
చనిపోతున్న వ్యక్తిని మోసుకుని తీసుకెళ్ళి మరీ ప్రాణాలు కాపాడారు కరీంనగర్‌లోని ఓ పోలీస్ కానిస్టేబుల్. పురుగుల మందు తాగాడని సమాచారం అందుకున్న కానిస్టేబుల్..2 కిలోమీటర్లు పొలాల నుంచి నడిచి ఊరికి చేరుకుని అతడిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఆమెను వరుస ప్రమాదాలు వెంటాడాయని...రెండు సార్లు తప్పించుకున్న లాస్య మూడోసారి మాత్రం తప్పించుకోలేకపోయిందని చెబుతున్నారు కుటుంబసభ్యులు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈరోజు రోజు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదానికి మూడు ముఖ్యమైన కారణాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. అందులో ముఖ్యమైనది సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే అంటున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో.. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో తల్లి, కుమారుడ్ని దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. గూడూరు మండల కేంద్రంలో కుమారస్వామి అనే వ్యక్తి.. ఆ తల్లి, కుమారుడ్ని ఇనుపరాడ్డుతో విచక్షణారహితంగా కొట్టి చంపాడు.
ముంబై 26/11 దాడుల సూత్రధారి...లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ మరణించాడని ఐక్యరాజ్యసమితి ధృవీకరించింది. ఇతను హఫీజ్ సయీద్‌కు డిప్యూటీగా ఉండేవాడు. హఫీజ్ గుండెపోటుతో మరణించాడని తెలిపింది.
జపాన్‌లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 62 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. భవనాల శిథిలాలు ఇంకా తొలగిస్తుండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.