Soundarya: సౌందర్య అకాలంగా మరణిస్తుందని ముందే తెలుసా.. ఆ యాగాలు చేసింది నిజమేనా!? పుట్టిన వెంటనే మరణాన్ని ఊహించవచ్చా? నటి సౌందర్య అకాలంగా ఈ లోకాన్ని వీడిచి వెళ్లి ఏప్రిల్ 17కు 20ఏళ్లు అవుతుంది. ఆమె మరణాన్ని ముందుగానే ఒక వ్యక్తి అంచనా వేశారని మీకు తెలుసా? ఎవరతను? సౌందర్య గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం! By srinivas 15 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Soundarya: దాదాపు 10ఏళ్ల పాటు టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది సౌందర్య. ఆమె తెలుగింటి అమ్మాయి కాదు.. అయినా అచ్చం అలానే ఉంటుంది. ఎక్స్‌పోజింగ్‌ను నమ్ముకోకుండా టాలెంట్‌ను నమ్ముకున్న ఈ స్టార్ హీరోయిన్ చీరకట్టులో టాలీవుడ్ మనసు దోచింది. కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న సౌందర్య 31ఏళ్ల వయసులోనే మరణించింది. నాడు బీజేపీ కోసం ఎన్నికల ప్రచారానికి బెంగళూరు -జక్కూరు విమానాశ్రయం నుంచి కరీంనగర్‌కు సౌందర్య రావాల్సి ఉంది. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి విద్యాసాగర్‌రావు తరపున ప్రచారం చెయ్యడానికి చార్టెర్డ్ విమానంలో సౌందర్య బయలుదేరారు. ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమరనాథ్, మరో వ్యక్తి ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం ఆవరణంలో కుప్పకూలింది. అక్కడికి వెళ్లి చూస్తే మొత్తం మంటలే కనిపించాయి. విమానంలో ఉన్న ముగ్గురూ కాలి బూడిదయ్యారు. జ్యోతిష్యుడు చెప్పినట్టుగా.. జూలై 18,1971న కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగల్ గ్రామంలో సౌందర్య జన్మించారు. ఆమె పుట్టినప్పుడే ఆమె మరణం త్వరగా సంభవిస్తుందని ఓ జ్యోతిష్యుడు చెప్పినట్టుగా పలు మీడియా సంస్థలు చెబుతుంటాయి. ఆమె అకాలంగా మరణిస్తుందని జ్యోతిష్యుడు చెప్పాడట. అందుకే సౌందర్య తల్లిదండ్రులు నిత్యం పూజలు, యాగాలు చేసేవారని ఆమె సన్నిహితులు అంటుంటారు. దాదాపు 12ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో స్టార్ హోదా అనుభవించిన సౌందర్య.. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో 100కు పైగ సినిమాల్లో నటించారు. సౌందర్య అసలు పేరు సౌమ్య. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు ఆమె తన పేరును సౌందర్యగా మార్చుకున్నారు. డాక్టర్ కావాలనుకున్న సౌందర్య MBBSలో జాయిన్ అయ్యారు. అయితే MBBS మొదటి సంవత్సరంలో ఉండగా.. ఆమె తండ్రి స్నేహితుడు, గంధర్వ చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అమ్మోరు సినిమాలో నటించారు సౌందర్య. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో సౌందర్య తన చదువును మధ్యలోనే ఆపేశారు. ఇది కూడా చదవండి: Vishwak Sen: గోదావరికి బై చెప్పిన విశ్వక్.. న్యూ లుక్కుతో ట్వీట్.. కెరీర్ పీక్స్‌లో ఉండగా.. తెలుగులో నాటి స్టార్ హీరోలందరితో నటించారు సౌందర్య. వెంకటేశ్- సౌందర్యది సూపర్ హిట్ పెయిర్‌గా సినీ లవర్స్ అభిప్రాయపడుతుంటారు. రాజా, జయం మనదేరా, పెళ్లి చేసుకుందాం, పవిత్రబంధం, ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో వెంకటేశ్‌తో జోడీగా నటించి మెప్పించారు సౌందర్య. అటు మెగాస్టార్‌తో సౌందర్య కాంబో కూడా అదిరిపోయేది. ముఖ్యంగా అన్నయ్య సినిమాలో చిరుతో కలిసి కామెడీని పండించారు సౌందర్య. ఇలా కెరీర్ పీక్స్‌లో ఉండగా తన మేనమామ, బాల్య స్నేహితుడైన రఘును ఏప్రిల్ 27,2003న పెళ్లి చేసుకున్నారు సౌందర్య. తర్వాత బీజేపీకి ప్రచారం చేయాలని నిర్ణయించుకోవడం ఆ వెంటనే విమాన ప్రమాదంలో మరణించడం సినీ లోకాన్ని విషాదంలో ముంచేసింది. సౌందర్య పార్థివదేహాన్ని చూడటానికి యావత్ సినీ లోకం తరలివెళ్లింది. ఈ సమయంలో ఆమె తల లేదని మొండెం మాత్రమే ఉందని సౌందర్య స్నేహితురాలు, నటి ప్రేమ. సౌందర్య చేతి వాచ్ చూసి అది ఆమెనని తెలుసుకున్నామని.. జీవితం ఇంతేనా అని ప్రేమ ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. #soundarya #death-mystery మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి