Telangana: ఎమ్మెల్యే దానంపై వేటుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు
పార్టీకి రాజీనామా చేయకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడం మీద బీఆర్ఎస్ ఆగ్రహంగా ఉంది. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని అనుకుంటోంది. అందులో భాగంగా దానం మీద వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని ప్రయత్నాలు చేస్తోంది.