Cyber Crime: సైబర్ నేరగాళ్లపై కేంద్రం ఉక్కుపాదం.. ఏకంగా 20 లక్షల సిమ్ కార్డుల బంద్!
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలను అంటే ఆన్లైన్ మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం అతి పెద్ద చర్యకు రెడీ అయింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న దాదాపు 20 లక్షల సిమ్ లను రీ వెరిఫై చేసి ఒకేసారి డిస్ కనెక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు అధికారులు తెలిపారు.