Cyber Crime : రూ. 49 లకే 48 కోడిగుడ్లు అంటూ.. 48 వేలు కాజేశారు!
4 డజన్ల కోడిగుడ్లను కేవలం రూ. 49 కే ఇస్తున్నామంటూ ఓ ఆన్ లైన్ మోసంతో బెంగళూరుకు చెందిన ఓ మహిళ తన ఖాతా నుంచి రూ. 48,199 లను పొగొట్టుకుంది. మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది.
4 డజన్ల కోడిగుడ్లను కేవలం రూ. 49 కే ఇస్తున్నామంటూ ఓ ఆన్ లైన్ మోసంతో బెంగళూరుకు చెందిన ఓ మహిళ తన ఖాతా నుంచి రూ. 48,199 లను పొగొట్టుకుంది. మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది.
కొత్తతరహా కిడ్నాప్ కథ ఇది. ఇందులో ముట్టుకోవడం.. కొట్టుకోవడం.. కార్లు.. గన్నులు ఏమీ ఉండవు. కిడ్నపర్లు ఫోన్ లో వినిపిస్తారు. బెదిరిస్తారు. డబ్బు గుంజేస్తారు. అంతా మాయగా జరిగిపోతుంది. అదే సైబర్ కిడ్నాప్. దీని గురించి వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. తాజాగా వర్క్ ఫ్రం హోం పేరుతో ఓ ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయికి లింక్ పంపించి టాస్క్‌లు చేయించారు. చివరికి ఆమె నుంచి రూ.91 కాజేశారు. పన్నుల రూపంలో మరో రూ.80 వేలు అదనంగా చెల్లించాలన్నారు. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
'అయోధ్య లైవ్ ఫోటోలు' ఉన్నాయని పేర్కొంటూ ఆన్లైన్లో చెలామణి అవుతున్న లింక్‌లను క్లిక్ చేయవద్దని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలా క్లిక్ చేయడం వల్లన సైబర్ నేరగాళ్లు మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు దోచుకునే ప్రమాదం ఉంది.
టెక్నాలజీ పెరుగుతుంటే.. మరోపక్క సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న వారి కోసం సైబర్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా రూ. 50,000 హామీ మొత్తం నుంచి రూ. 1 కోటి వరకు ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంది.
టెక్నాలజీ పెరిగడం మనల్ని ఎంత సుఖపెడుతోందో అంతే కష్టపెడుతోంది కూడా. ఇప్పుడు ఎక్కడికీ వెళ్ళక్కర్లేకుండా అన్నీ ఆన్ లైన్లోనే పనులు జరిగిపోతున్నాయి. కానీ అదే టైమ్‌లో సైబర్ నేరాలు కూడా ఎక్కువయిపోయాయి. సైబర్ నేరగాళ్లు తాజాగా పాస్వర్డ్ లేకపోయినా గూగుల్ అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు.
2023 వార్షిక నేర నివేదికను సీపీ సుధీర్ బాబు బుధవారం విడుదల చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 6.86 శాతం నేరాలు పెరిగాయని తెలిపారు. సైబర్ నేరాలు 25 శాతం పెరిగితే మహిళలపై 6.65 శాతం అఘయిత్యాలు తగ్గినట్లు వెల్లడించారు. మొత్తం 27586 కేసులు నమోదయ్యాయి.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు భారీగా పెరిగాయన్నారు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి. గతేడాది కంటే ప్రస్తుతం ఎక్కువ కేసులు నమోదయ్యాయన్నారు. వార్షిక నేర నివేదికను రిలీజ్ చేశారు.
పుణేలో ఓ టెకీని దారుణంగా మోసం చేశారు సైబర్ చీటర్స్. యాడ్స్ ద్వారా ఇన్కమ్ సంపాదించొచ్చు అని చెప్పి ఏకంగా రూ. 17 లక్షలు కొట్టేశారు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు.. పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.