పాకిస్తాన్లో చర్చిపై దుండగుల దాడి, అప్రమత్తమైన పోలీసులు
పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో చర్చిని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆ చర్చి పరిసర ప్రాంతాల్లోని క్రైస్తవులు నివసించే ప్రాంతాల్లో లూటీలకు తెగబడ్డారు. క్రైస్తవ మతస్తుడు ఇస్లాం దైవదూషణకు పాల్పడ్డారనే నెపంతో గుర్తుతెలియని వ్యక్తులు ఈ విధ్వంసానికి పూనుకున్నారని తెలిపారు. దీంతో అక్కడ పరిస్థితిని నియంత్రించడానికి పాకిస్తాన్ రేంజర్లు రంగంలోకి దిగాయి.