Breaking: చిత్తూరులో ఘోర ప్రమాదం..నలుగురు మృతి!
చిత్తూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.గంగాసాగరం వద్ద ఆగిఉన్న టిప్పర్ ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.