Eluru: జిల్లా జైలులో మహిళా ఖైదీ ఆత్మహత్య!
భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రిమాండ్ ఖైదీ శాంతకుమారి ఏలూరు జిల్లా జైలులో ఆత్మహత్య చేసుకుంది.భర్త బోసుబాబును హత్య చేసిన నేరం కింద పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రిమాండ్ ఖైదీ శాంతకుమారి ఏలూరు జిల్లా జైలులో ఆత్మహత్య చేసుకుంది.భర్త బోసుబాబును హత్య చేసిన నేరం కింద పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
గుంటూరులోని ఫిరంగిపురంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సవతి తల్లి లక్ష్మి ఆరేళ్ళ కుమారుడిని గోడకేసి కొట్టి చంపింది. సాగర్ అనే వ్యక్తి మొదటి భార్య చనిపోవడంతో లక్ష్మిని రెండవ వివాహం చేసుకున్నారు. మొదటి భార్య పిల్లలు అనే కోపంతో లక్ష్మీ వారిని తరచూ హింసిస్తూ ఉండేది.
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పండగ రోజు కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంది. గాంధీ బజార్ లో నివాసముంటున్న గోల్డ్ స్మిత్, కృష్ణాచారి భార్య, ఇద్దరు పిల్లతో సహా ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నారు.
సంతానం కోసం ఓ తాంత్రికుడు నరబలి ఇచ్చిన దారుణ ఘటన బిహార్లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మిస్సింగ్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సంతానం కోసం నరబలి ఇచ్చినట్లు గుర్తించారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు.
సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.50 లక్షలు మోసపోయిన ఓ వృద్ధ దంపతులు చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం బెళగావి బిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
రాజేంద్రనగర్ అత్తాపూర్ లో టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఇంట్లో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పింకీ ఆత్మహత్య కు తన భర్త వేధింపులు కారణమా లేదా వేరే ఏమైనా కారణమా అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలోని పెద్దపల్లిలో పరువు హత్య ఘటన చోటుచేసుకుంది. కూతురిని ప్రేమిస్తున్నాడని ఓ తండ్రి యువకుడిని అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. దీంతో ఆ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
కామారెడ్డిలో రమేష్ అనే వ్యక్తి పోచయ్యకు కారును విక్రయించాడు. ఈఎంఐ కట్టే విధంగా ఒప్పందం చేసుకున్నారు. కానీ డబ్బులు కట్టకపోవడంతో రమేష్ కారును తీసుకురావడానికి ప్రయత్నించాడు. దీంతో పోచయ్య తన అల్లుడితో కలిసి స్తంభానికి కట్టేసి కొట్టడంతో రమేష్ మృతి చెందాడు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ స్టేజి సమీపంలో కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కేసారం గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. మంటలను గమనించిన ఆయన వెంటనే బయటకు దిగడంతో ప్రమాదం తప్పింది.