Priyanka Gandhi: ఖమ్మం నుంచి ఎంపీగా ప్రియాంక పోటీ?
తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం ఎంపీ టికెట్ హాట్ టాపిక్‌గా మారింది. సోనియా గాంధీ ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రచారం జరగగా.. తాజాగా ప్రియాంక గాంధీ అక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లాలని అనుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.