CM Jagan: సంక్రాంతి నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం?
ఎన్నికల ముందు సీఎం జగన్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో లాగా ఏపీలో కూడా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఎన్నికల ముందు సీఎం జగన్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో లాగా ఏపీలో కూడా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.
సీఎం జగన్ పై చురకలు అంటించారు టీడీపీ నేత లోకేష్. ఆయన మాటలు మాత్రమే కోటలు దాటుతాయి, పనులు గడపదాటవు అంటూ విమర్శలు చేశారు. కడప స్టీల్ ప్లాంట్ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదని అన్నారు.
సీఎం జగన్ పై మాజీ మంత్రి కిడారి శ్రవణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నాలుగున్నరేళ్ళ తరువాత జగన్ గిరిజన ప్రాంతానికి వచ్చారని.. ఏమైనా మంచి చేస్తారేమో అని ప్రజలు భావించారన్నారు. కానీ జగన్ గనుల సర్వే కోసమే వచ్చినట్లు అనిపిస్తుందన్నారు.
తిరుపతి జిల్లాలో సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా మంత్రి రోజా జగన్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. క్రిస్మస్ తాత వేషంలో వెళ్లి ఓ పేద కుటుంబాన్ని సర్ప్రైజ్ చేశారు. వారి సమస్యలు తెలుసుకుని ఆ కుటుంబానికి అండగా నిలిచారు మంత్రి రోజా.
సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. యువగళం విజయోత్సవ సభను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసిందని మండిపడ్డారు. ఎవరు ఊహించని రీతిలో జనాలు సభకు వచ్చారని హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. దీని ద్వారా 4 లక్షల 34 వేల మంది 8వ తరగతి విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అనంతరం సీఎం జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు.
8వ తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం రేపటి నుంచి ట్యాబ్‌లు అందించనుంది. 10 రోజుల పాటు ఈ ట్యాబ్‌ల పంపిణీ జరగనుండగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ట్యాబ్‌ల పంపిణీతో ప్రతి విద్యార్థికి రూ. 33,000 లబ్ధి చేకురనుంది.
జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను విడుదల చేశారు ఏపీ సీఎం జగన్. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ. 41. 60 కోట్లను విడుదల చేశారు. రూ. 8 లక్షల వార్షికాదాయం లోపు ఉన్న వారందరికీ ఈ పథకం అందిస్తున్నట్లు తెలిపారు.
ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది జగన్ సర్కార్. మొత్తం 1.48 కోట్ల స్మార్ట్‌కార్డులను వైద్యశాఖ ముద్రించింది. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే.