CM Jagan: సంక్రాంతి నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం? ఎన్నికల ముందు సీఎం జగన్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో లాగా ఏపీలో కూడా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. By V.J Reddy 24 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Free Bus Scheme In AP: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహళలక్ష్మి పథకం కింద మహిళలకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులో ఉచిత ప్రయాణానికి మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకుంటున్నారని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని.. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస్థాయిలో 3 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజూ సగటున 30 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారని వెల్లడించారు. పురుషులతో కలుపుకుంటే మొత్తంగా ప్రతి రోజూ 51 లక్షల మందిని సురక్షితంగా సంస్థ గమ్యస్థానాలకు చేర్చుతోందని అన్నారు. ప్రయాణికుల్లో 62 శాతం మంది మహిళలే ఉంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: AP Politics : జగన్‌కు పీకే ఝలక్.. ఇక టీడీపీ కోసం వ్యూహాలు.. ఇదిగో ప్రూఫ్! ఎన్నికలు.. ఏపీలో కూడా ఈ పథకం అమలు? ఆంధ్ర ప్రదేశ్ లో మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నారు. ఈ తరుణంలో ప్రజలను ఆకట్టుకునేందుకు అక్కడి ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు కార్యాచరణ చేపడుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే, ఇటీవల జరిగిన యువగళం విజయోత్సవ భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రజలపై హామీల వర్షం కురిపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల వాలే ఏపీలో కూడా ఐదు గ్యారెంటీలను చంద్రబాబు ప్రకటించారు. అందులో మహాశక్తి పథకం ద్వారా టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఎన్నికల ముందే ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏపీలో ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుంది? రోజు వారీ ప్రయాణికుల్లో మహిళలు ఎంతమంది ఉంటారు? అనే అంశంపై జగన్ అధికారులను అరా తీసినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఈ పథకాన్ని కొత్త ఏడాది రోజు లేదా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ALSO READ: సీఎం రేవంత్ కీలక భేటీ.. ధరణి రద్దు, రైతు బంధు అంశాలపై కసరత్తు #breaking-news #ap-news #free-bus-scheme-in-ap #cm-jagan #telugu-latest-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి