BREAKING: టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు
ఎన్నికల వేళ వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్య టీడీపీలో చేరారు.
ఎన్నికల వేళ వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్య టీడీపీలో చేరారు.
లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరంలో ఏర్పాటు చేయనున్నారు టీడీపీ నేతలు. ఈ సభ కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఈ సభకు హాజరు కానున్నారు.
టీడీపీ ఛీఫ్ చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లో జగన్ సర్కార్ కూలిపోవడం ఖాయమని అన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఎవరు ఆ వైసీపీ ఎమ్మెల్యేలు అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.
సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే 11 మంది ఇంఛార్జిలను వైసీపీ పార్టీ మార్చిందని ఆయన పేర్కొన్నారు. పులివెందుల టికెట్ బీసీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు సీఎం జగన్. తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్కకు వచ్చిన ఓట్లు జనసేనకు రాలేదని సెటైర్లు వేశారు జగన్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్స్ అని పేర్కొన్నారు.
ఇంఛార్జిల మార్పు, ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ పై సజ్జల రామకృష్ణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు సిట్టింగులను మార్చడం సాధారణ ప్రక్రియ అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తాను సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం కేసీఆర్ ను పరామర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు పోసాని కృష్ణమురళి. తెలంగాణలో జనసేనకు టీడీపీ ఎందుకు సపోర్ట్ చేయలేదో చెప్పాలన్నారు. ఏపీలో పవన్ సపోర్ట్ చేస్తున్నపుడు తెలంగాణలో టీడీపీ సపోర్ట్ చేయాలి కదా ? ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నలు గుప్పించారు.