NEET: నీట్ పేపర్ లీక్‌లో కేసులో మరో ఇద్దరి అరెస్ట్..
నీట్ పేపర్ లీక్ విషయంలో మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది సీబీఐ. జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహ్సాన్ ఉల్ హక్, సెంటర్ సూపరింటెండెంట్ ఇంతియాజ్‌లను అదుపులోకి తీసుకుంది.
నీట్ పేపర్ లీక్ విషయంలో మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది సీబీఐ. జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహ్సాన్ ఉల్ హక్, సెంటర్ సూపరింటెండెంట్ ఇంతియాజ్‌లను అదుపులోకి తీసుకుంది.
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సందర్భంగా.. సీబీఐ కవిత పేరును ప్రస్తావించింది. మద్యం వ్యాపారానికి సహకరించేందుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కేజ్రీవాల్ పార్టీ ఫండ్ అడిగినట్లు తెలిపింది. కవితను కలవాలని కేజ్రీవాల్ మాగుంటకు సూచించారని.. ఆమె మాగుంటను రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్లు పేర్కొంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయనను అరెస్ట్ చేయడానికి కల కారణాలను కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడానికి అవసరమైన సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయన్న సీబీఐ ప్రతి విషయాన్ని కోర్టుకు వివరించింది.
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది.
తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. దాంతో పాటూ ఆయనను రేపు ట్రయల్ కోర్టులో హజరు పరిచేందుకు కూడా సీబీఐకు అనుతి లభించింది. రేపు సీబీఐ కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపర్చనుంది.
నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం సీబీఐకి శనివారం అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సీబీఐ దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేంద్ర విద్యాశాఖ సూచన మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
బ్యాంకును మోసం చేసిన కేసులో డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ ధీరజ్ వాధవన్ ను సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. అనంతరం ఆయనని కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారతీయ యువతను ఆకర్షిస్తున్న ట్రావెల్ ఏజెంట్ల పెద్ద ముఠా గుట్టును సీబీఐ రట్టు చేసింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి సహా నలుగురిని సీబీఐ మంగళవారం అరెస్టు చేసింది.
గత ఏడాది జరిగిన మణిపూర్ మహిళలను నగ్నంగా ఊరేగించడం...దాని తర్వాత జరిగిన హింస ఎంత సంచలనం రేపాయో అందరికీ తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఛార్జ్‌షీట్‌లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. పోలీసుల కళ్ళెదుటే అంతా జరుగుతున్నా వారు ఏమీ చేయలేదని తెలుస్తోంది.