Liquor Scam: మరిన్ని చిక్కుల్లో ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ సంచలన వ్యాఖ్యలు
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సందర్భంగా.. సీబీఐ కవిత పేరును ప్రస్తావించింది. మద్యం వ్యాపారానికి సహకరించేందుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కేజ్రీవాల్ పార్టీ ఫండ్ అడిగినట్లు తెలిపింది. కవితను కలవాలని కేజ్రీవాల్ మాగుంటకు సూచించారని.. ఆమె మాగుంటను రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్లు పేర్కొంది.