Earthquake : జార్జియాలో భారీ భూకంపం
జార్జియా దేశంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.2గా నమోదైందని అమెరికా భూకంప కేంద్రం తెలిపింది. ఆకస్మిక ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. భూకంప ప్రభావంతో పలు ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది.