KTR On Valmiki Scam: కర్ణాటకలో స్కామ్.. తెలంగాణ నేతలకు డబ్బులు.. కేటీఆర్ సంచలన ట్వీట్
కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్లో తెలంగాణ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు.. లోక్సభ ఎన్నికల సమయంలో తెలంగాణలోని 9మందికి మద్యం, డబ్బు పంచడం కోసం రూ.90 కోట్లు అందాయని ఈడీ, సిట్ విచారణలో ప్రాథమికంగా తేలిందని చెప్పారు.