HYDRA: జన్వాడ ఫామ్‌హౌస్ పై హైడ్రా సంచలన నిర్ణయం.. కూల్చివేత ఎప్పుడంటే?

కేటీఆర్ మిత్రుడికి చెందిన జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేయాలని హైడ్రా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరో రెండ్రోజుల్లోనే ఆ నిర్మాణం నేలమట్టం అవడం ఖాయమన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ ఫామ్ హౌస్ నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని హైడ్రా విచారణలో తేలినట్లు సమాచారం.

New Update
HYDRA: జన్వాడ ఫామ్‌హౌస్ పై హైడ్రా సంచలన నిర్ణయం.. కూల్చివేత ఎప్పుడంటే?

అక్రమ కట్టడాల కూల్చివేతల్లో దూకుడుగా వెళ్లున్న హైడ్రా.. త్వరలో మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. జన్వాడలో కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫామ్‌హౌస్ ను కూల్చివేయాలని హైడ్రా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఫామ్‌హౌస్ కూల్చివేతపై హైకోర్టు సైతం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో హైడ్రా కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫామ్ హౌస్ యజమాని నిన్న హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కూల్చివేతపై స్టే ఇవ్వాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. కానీ ఆయన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.

నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని హైడ్రాకు స్పష్టం చేసింది. యజమాని వద్ద ఉన్న అన్ని డ్యాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. దీంతో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఫామ్‌హౌస్ FTL పరిధిలోకి వస్తుందా? లేదా? అన్న అంశంపై హైడ్రా వివరాలను సేకరిస్తోంది. అసలు నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారా? లేదా? అన్న కోణంలో విచారణ చేస్తోంది.

ఈ మేరకు అన్ని డాక్యుమెంట్లను పరిశీలిస్తోంది. ఫామ్‌హౌస్‌ అసలు యజమాని ప్రదీప్‌రెడ్డి నుంచి పూర్తి వివరాలను ఇప్పటికే అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్ నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని అధికారులు తేల్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఈ ఫామ్ హౌస్ ను కూల్చివేయడం ఖాయమన్న వార్తలు వస్తున్నాయి.

Also Read : ఆగస్టు 25న స్వయంగా హాజరు కండి.. సీఎం రేవంత్‌రెడ్డికి కోర్టు సమన్లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు