Telangana : ఇవాళ తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ, అమిత్ షా
తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్లోని జనజాతర సభలో పాల్గొననున్నారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.