Uttar Pradesh : యోగిని బుల్డోజర్లతో కూల్చిన యూపీ ఓటర్లు.. దూసుకెళ్తున్న ఇండియా కూటమి!
ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి భారీగా గండి పడింది. యూపీ తమదే అనే ధీమాలో ఉన్న బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఇండియా కూటమి దుమ్మురేపుతోంది. మొత్తం 80 లోక్ సభ స్థానాలుండగా ఇండియా కూటమి 44 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీయే 35 స్థానాల్లో కొనసాగుతోంది.