Kishan Reddy: నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు.?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన విధానం సరికాదన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన విధానం సరికాదన్నారు.
పొత్తుల అంశాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని ఏపీ బీజేపీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేయాలని పవన్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఏపీ బీజేపీ.. పవన్ వ్యాఖ్యలను జాతీయ నాయకత్వం చూసుకుంటుందని తెలిపింది.
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. మొదటిరోజు పాత భవనంలో చర్చ మొదలవ్వగా రెండవరోజు 19 నుంచి కొత్త పార్లమెంటు భవనంలో సమావేవాలు జరుగుతాయి. ఈ సెషన్స్ లో రాజ్యసభలో మూడు , లోక్ సభలో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం అజెండాను విడుదల చేసింది.
ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ..రాజస్థాన్ లో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నో సంవత్సరాలుగా ఆ పార్టీకి సేవలు అందిస్తున్న జ్యోతి మీర్దా ఆ పార్టీని వీడి కమలం గూటికి చేరారు.
ఇండియా పేరును భారత్ గా మార్చడం ఇష్టం లేకపోతే దేశం వదిలివెళ్ళిపోండి అంటున్నారు బీజెపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్. బెంగాల్ లో తాము అధికారంలోకి వస్తే అక్కడ ఉన్న విదేశీయుల విగ్రహాలను వెంటనే తొలిగిస్తామని చెప్పారు. ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో దిలీప్ ఈ వ్యాఖ్యలను చేశారు.
శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత గోద్రా లాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రామమందిర ప్రారంభోత్సవానికి దేశం నలమూలాల నుంచి బస్సులు, ట్రక్కులలో రామాలయ ప్రారంభోత్సవానికి ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రజలను ఆహ్వానించే అవకాశం ఉందన్నారు.
బీజేపీ (BJP) ఒక విష సర్పం అని అన్నారు. దాని నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నుంచి టీబీజేపీ అధిష్ఠానం దరఖాస్తుల ప్రక్రియ చేపట్టింది. ఆరో రోజు బీజేపీ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. దరఖాస్తులను ఇవ్వడానికి అభ్యర్థులు వస్తుండడంతో బీజేపీ కార్యాలయం సందడిసందడిగా ఉంది.
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టుపై తెలంగాణ బీజేపీ నేత, ఎమ్మెల్యే రఘునందన్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఓ ప్రతిపక్ష నాయకుడిని ఇలా అరెస్టు చేయడం..వెనక బలమైన సాక్ష్యాలు, ఆధారాలు ఉండి ఉండాలని అభిప్రాయపడ్డారు.