Kodali Nani: ఎంపీ పదవి కోసమే పురందేశ్వరి ఆరాటం: కొడాలి నాని
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఎంపీ పదవి కోసం ఆరాటపడుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. బీజేపీని.. టీడీపీకి తాకట్టు పెట్టడానికి పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు.
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఎంపీ పదవి కోసం ఆరాటపడుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. బీజేపీని.. టీడీపీకి తాకట్టు పెట్టడానికి పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు.
ఏపీ రాజకీయాల్లో విశాఖ ఎంపీ సీటు ఇప్పుడు రసవత్తరంగా మారింది. సీటు తనకంటే తనకంటూ పురందేశ్వరి, జీవీఎల్ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ, జనసేనలతో పొత్తు కుదిరితే ఆ సీటు ఎవరికనే సస్పెన్స్ కొనసాగుతుంది.
రాజమండ్రి విమానాశ్రయ నూతన టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు. రాజమండ్రిలో విమానాశ్రయం ఏర్పాటుపై బీజేపీ, వైసీపీ నేతలు కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఎంపీ భారత్ కేంద్రాన్ని కోరారు.
జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నుంచి రూ. 200 కోట్లు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఈ ఘటనపై బీజేపీ పురందేశ్వరి స్పందించారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని అరోపించారు. బిజెపి అధికారంలో లేని రాష్ట్రాల్లో భారీ స్ధాయిలో అవినీతి జరగుతోందని కామెంట్స్ చేశారు.
వైసీపీ సర్కార్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి అప్పుల మీద ఉన్న శ్రద్ద అభివృద్ధిపై లేదని మండిపడ్డారు. ఒక్క పరిశ్రమ లేదు, ఉద్యోగం లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. తండ్రికి ఒక్క ముద్ద కూడా పెట్టలేని నీలాంటి కూతురు.. శత్రువుకి కూడా పుట్టాలని ఎవరూ కోరుకోరమ్మా.. అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
బెయిల్ రద్దు చేయమని చెప్పడంలో పురందేశ్వరి క్రిమినల్ మైండ్ అర్థమవుతోందన్నారు విజయసాయిరెడ్డి. జగన్ పై ఉన్న కేసులను తేల్చాలని, విజయసాయి బెయిల్ రద్దు చేయాలని ఇటీవల పురందేశ్వరి సీజేఐకి లేఖ రాయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయి ఘాటుగా స్పందించారు.
పురందేశ్వరి టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా పనిచేస్తున్నట్టుందని మంత్రి పెద్దిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఆమె టీడీపీ కోసం పనిచేసినా తమకేమీ ఇబ్బందిలేదన్నారు. కానీ, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
ఏపీలో రాజకీయ వేడి రగులుతోంది. తాను అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేఖ రాయడంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు.