ఓటమిపై స్పందించిన బర్రెలక్క.. మరో సంచలన నిర్ణయం
సోషల్ మీడియా స్టార్ బర్రెలక్క (శిరీష) తన ఓటమిపై స్పందించింది. ఈ పరాజయం తనపై ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పింది. ఎందుకంటే తనకు అనుకున్నదానికంటే ఎక్కువే ఓట్లు పడ్డాయని, అండగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు తెలిపింది. చివరగా ఎంపీగా పోటీచేస్తానని ప్రకటించింది.