AYODHYA HOTELS :అయోధ్యలో ఆకాశాన్నంటుతున్న హోటల్స్, గెస్ట్ హౌస్ ల అద్దెలు
అయోధ్య రామ మందిర ప్రారంభ తేదీ ఖరారైనప్పటి నుంచి అయోధ్యలో హోటల్ గదుల అద్దెలు భారీగా పెరిగాయి.తేదీ సమీపిస్తున్న కొద్దీ, ఛార్జీలు కూడా అనేక రెట్లు పెరిగాయి. అయోధ్యలోని హోటల్ ధరలు లక్ష రూపాయలకు చేరుకున్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కూడా పేర్కొంది.