Ayodhya: రామ మందిర నిర్మాణానికి యాచకుల ఉడతా సాయం
వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్యలో వైభవంగా జరగబోతున్న రాం లల్లా విగ్రహ ప్రతిష్ఠ కోసం యావద్దేశం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఏర్పాట్లు చకాచకా సాగుతున్నాయి. భక్తులు శక్తికి మించి ధన, వస్తు రూపేణా సహకారం అందిస్తున్నారు. యూపీలో కొందరు యాచకులూ ముందుకొచ్చి విరాళమివ్వడం విశేషం.