Ayodhya Ram Mandir : రామలయ ప్రాణప్రతిష్టకు ప్రముఖులకు ఆహ్వానం
అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ పలువురు రాజకీయ, సినిమా, క్రీడా ప్రముఖులను ట్రస్ట్ ఆహ్వానిస్తున్నది.
అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ పలువురు రాజకీయ, సినిమా, క్రీడా ప్రముఖులను ట్రస్ట్ ఆహ్వానిస్తున్నది.
అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మారిషస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 22న హిందువులకు సెలవు ఇవ్వాలని మారిషస్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఆల్ లైన్ ట్రావెల్ ఫ్లాట్ ఫాం మేక్ మై ట్రిప్ డేటా తెలిపిన వివరాల ప్రకారం గత రెండేళ్లలో మతపరమైన ప్రదేశాల కోసం ఆన్ లైన్ లో సెర్చ్ చేసేవారి శాతం 97శాతం పెరిగింది. వీటిలో అయోధ్య నగరం, అక్కడ నిర్మిస్తున్న రామమందిరం గురించి అత్యధిక మంది సెర్చ్ చేశారు.
భారతీయ మూలాలు ఉన్న ఆఫ్రికాలోని మారిషస్ దేశం రామ మందిరం వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది.జనవరి 22, 2024 న అక్కడి అధికారులకు రెండు గంటల పాటు విరామం ఇవ్వాలని హిందూ సామాజిక -సాంస్కృతిక సంస్థలు చేసిన అభ్యర్థనను మారిషస్ ప్రభుత్వం అంగీకరించింది.
అయోధ్య భవ్య రామమందిరం ఈనెల 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. రామయ్యను దర్శించుకోవాలని దేశ ప్రజలంతా ఊవ్విళ్లూరుతున్నారు. అయోధ్యారాముడి క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అయోధ్యకు స్పెషల్ ఆఫర్లు, వోచ్చర్లు, పాస్ ల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు.
అయోధ్య రాముడి మహాప్రసాదం నేరుగా మీ ఇంటికే వస్తుంది. ఖాదీ ఆర్గానిక్స్.కామ్ వెబ్ సైట్ ఈ సదుపాయాన్ని కల్పిస్తుంది. మీరు ఇంట్లోనే కూర్చుండి ఈ వెబ్ సైట్లో మహాప్రసాదాన్ని ఆర్డర్ చేయవచ్చు. ఈ మహాప్రసాదానికి రూ. 50చెల్లిస్తే సరిపోతుంది.
జనవరి 22న అయోధ్యలో జరిగే రాముల వారి ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్కు చెందిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి(64) రూ.64 లక్షల విలువైన బంగారు పూత పూసిన చెప్పులు ధరించి అయోధ్యకు 8,000 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్తున్నారు.
అయోధ్యాపురి రామాలయ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వెయ్యేళ్లవరకు చెక్కుచెదరదు. తూర్పు-పడమర పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. ప్రతి అంతస్తులో ఆలయం 20 అడుగుల ఎత్తులో ఉంది. దీనికి 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి.
2500ఏళ్ల నిలిచి ఉండే అద్భుత ఆధ్యాత్మిక కట్టడం. ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందమైన నిర్మాణం. ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ ఆలయం. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపం. ఇవి అయోధ్యలోని రామమందిర వైభవాన్ని చాటిచెప్పే విశిష్టతలు.