రామమందిరం గురించి ఈ విశేషాలు మీకు తెలుసా!
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశమంతా రామమయం అయ్యింది. రామమందిర నిర్మాణానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విశేషాలివి.
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశమంతా రామమయం అయ్యింది. రామమందిర నిర్మాణానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విశేషాలివి.
అయోధ్యలో మసీదును నిర్మించేందుకు ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) డెవలప్మెంట్ కమిటీ సిద్ధమైంది. పవిత్ర రంజాన్ నెల తర్వాత ఈ ఏడాది మే నెలలో మసీదు నిర్మాణం మొదలుపెడతామని తెలిపింది. 3 నుంచి 4 ఏళ్లలో మసీదు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పింది.
అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పలువురు సినీ తారలు సందడి చేశారు. ఈ వేడుకల్లో నటి కంగనా రనౌత్ జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేస్తూ డాన్స్ వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ ముగిసింది. రేపటి నుంచి రాములవారని భక్తులు దర్శించుకోవచ్చు. అక్కడ దర్శనం, హారతి వేళలకు సంబంధించిన వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తమ వెబ్సైట్లో వెల్లడించింది.
అయోధ్య రాములవారికి గుజరాత్‌కు చెందిన దిలీప్ కుమార్ వి లాఖీ అనే వజ్రాల వ్యాపారి రాముడి కోసం ఏకంగా 101 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. అంటే ఏకంగా రూ.68 కోట్లు విరాళం ఇచ్చారు. ఈ బంగారాన్ని గుడి తలుపులు, గర్భగుడి, త్రిశూలం, పిల్లర్లకు కేటాయించినట్లు తెలుస్తోంది.
అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ఇటీవల తాను చేపట్టిన 11 రోజుల ఉపవాస దీక్షను విరమించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ప్రధానికి రాముడి పూజ కోసం ఉపయోగించిన పానీయాన్ని తాగించి దీక్ష విరమింపజేశారు.
ఎన్నో బలిదానాలు, త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ తిరిగొచ్చాడని ప్రధాని మోదీ అన్నారు. రామభక్తులందరూ ఈరోజు ఆనంద పరవశంలో ఉన్నారని.. ఈ క్షణం కోసమే ప్రజలు వందళ ఏళ్లుగా ఎదురుచూశారని తెలిపారు. దేశం మొత్తం ఈరోజు దీపావళి పండుగ జరుపుకుంటోందని పేర్కొన్నారు.
గుజరాత్‌కు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక రామమందిర నిర్మాణం కోసం రూ.52 లక్షల విరాళాలు సేకరించింది. 11 ఏళ్ల వయసప్పటి నుంచే 50 వేల కి.మీ ప్రయాణించి వివిధ ప్రాంతాల్లో 300లకు పైగా ప్రదర్శనలు ఇచ్చి వాటి నుంచి వచ్చిన సొమ్మును రామాలయ నిర్మాణం కోసం ఇచ్చేసింది.