Israel: గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు..85 మంది మృతి
హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. తాజాగా చేసిన దాడుల్లో 85 మంది మరణించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చేసిన వైమానిక దాడుల్లో 400 మంది చనిపోయారు.
హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. తాజాగా చేసిన దాడుల్లో 85 మంది మరణించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చేసిన వైమానిక దాడుల్లో 400 మంది చనిపోయారు.
గాజా స్ట్రిప్, దక్షిణ లెబనాన్, దక్షిణ సిరియాలపై ఇజ్రాయెల్ మళ్ళీ దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటికి 200 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రముప్పు పొంచి ఉన్న కారణంగానే దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది.
కీవ్ పై మాస్కో వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. తాజాగా ఉక్రెయిన్ కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా మాస్కో దళాలు దాడులు చేశాయి. కీవ్ మేయర్ విటాలి కీచ్కోస్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ముంబయి భీకర ఉగ్రదాడి దోషిగా తేలిన తహవూర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ప్రకటన వచ్చింది.
సిరియాలోని వాయువ్య ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మహ్మద్ సలాహ్ అల్-జబీర్ను అమెరికా సైన్యం మట్టుబెట్టింది.తీవ్రవాద గ్రూపులను నాశనం చేసే క్రమంలో ఈ దాడులు జరిగినట్లు వివరించాయి.
రష్యా ఎక్కడా తగ్గడం లేదు. ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా పోలాండ్ సరిహద్దుల్లో భారీ స్థాయిలో దాడులు చేసింది. కీలకమైన గ్యాస్, ఎరువుల సరఫరా కేంద్రాలను కూల్చేశాయి రష్యా క్షిపణులు. దీంతో నాటో యుద్ధ విమానాలను ఉక్రెయిన్ రంగంలోకి దించింది.