Kadapa: కడపలో ఏటీఎం చోరీల కలకలం.. ఒకే రోజు 3 చోట్ల దొంగలు ఏం చేశారంటే?
కడప జిల్లాలో ఏటీఎం దొంగతనాలు దుమారం రేపుతున్నాయి. నగరంలోని పలు ఏటీఎంలో డబ్బు చోరీకి గురైంది. విశ్వసరాయ సర్కిల్ వద్ద చోరీకి ప్రయత్నించగా సైరాన్ మోగడంతో దొంగలు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.