DK Aruna: స్పీకర్ తన కాల్‌ను లిఫ్ట్ చేయడం లేదు
హైకోర్టు ఆర్డర్ కాపీతో డీకే అరుణ అసెంబ్లీకి వెళ్లారు. అక్కడ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో హైకోర్టు ఆర్డర్ కాపీని ఆమె అసెంబ్లీ సిబ్బందికి ఇచ్చినట్లు తెలిపారు. స్పీకర్ వెంటనే హైకోర్టు ఆర్డర్ కాపీని ఇంప్లిమెంట్ చేయాలని డీకే అరుణ కోరారు.