జుబీన్ గార్గ్ మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం
ప్రముఖ అస్సామీ గాయకుడు, సంగీత దర్శకుడు జుబీన్ గార్గ్ అకాల మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ గార్గ్ మృతి చెందినట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ ఈ ఘటనలో ఏదో కుట్ర ఉందని అభిమానులు, పలు సంస్థలు ఆరోపిస్తున్నాయి.