Soldiers Dead : లడఖ్‌లో ప్రమాదం.. ఐదుగురు ఆర్మీ జవాన్లు మృతి
లడఖ్‌లో ఇండియన్ ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశ్రుతి జరిగింది. లేహ్‌కు 148 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందిర్ మోర్ సమీపంలో టి 72 యుద్ధ ట్యాంకర్ నదిని దాటుతుండగా ఒక్కసారిగా నది ప్రవాహం పెరగడంతో ట్యాంకర్‌లో ఉన్న ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.