Breaking : ఏపీలో అల్లర్లు.. ఇద్దరు ఎస్పీలు సస్పెండ్!
ఏపీలో ఎన్నికల వేళ కొనసాగుతున్న అల్లర్లపై ఈసీ సీరియస్ అయింది. ఘర్షణలను కంట్రోల్ చేయడంలో విఫలమైన పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి డీఎస్పీలపై బదిలీ వేటు వేసింది. వీరిపై శాఖపరమైన చర్యలకు ఆదేశించింది.