BIG BREAKING: విడదల రజినికి జగన్ కీలక పదవి!
AP: మాజీ మంత్రి విడదల రజినికి వైసీపీ అధినేత జగన్ కీలక పదవి కట్టబెట్టారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమన్వయకర్తగా రజినిని నియమించారు. గతంలో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా రజిని ఎన్నికైన సంగతి తెలిసిందే.
రాజకీయాలు చూస్తే అసహ్యం వేస్తోంది: కేంద్ర మంత్రి పెమ్మసాని సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుత రాజకీయాలు చూస్తే అసహ్యం వేస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలో వందకు వంద శాతం కరెక్ట్ గా జరుగుతుందని ఎవరూ చెప్పరన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గామారాయి.
Nara Lokesh: నేను జగన్ రెడ్డి బాధితుడినే.. లోకేష్ ఫైర్!
AP: గత ఐదేళ్లలో రాష్ట్ర నాశనం అయిందని అన్నారు లోకేష్. తాను కూడా జగన్ బాధితుడిని చెప్పారు. పాదయాత్రలో మాట్లాడుతుంటే తన స్టూల్, మైక్ లాగేశారని మండిపడ్డారు. అడుగడుగునా ఇబ్బంది పెట్టారని చెప్పారు. వారికి సినిమా చూపిస్తా అని వార్నింగ్ ఇచ్చారు.
VASIREDDY PADMA: వైసీపీకి కీలక నేత రాజీనామా!
AP: జగన్కు మరో షాక్ తగిలింది. వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్కు పంపారు.