Vallabhaneni Vamsi: ఏపీలో ఉద్రిక్తత..వల్లభనేని వంశీ కేసులో కీలక మలుపు
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ను బెదిరించారని వంశీ పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు.