CM Jagan: పెన్షన్ రూ.5000లకు పెంపు!
ఏపీ రాజధానిలో భూమి లేని నిరుపేదలను పెన్షన్ పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.2500గా ఉన్న పెన్షన్‌ను రూ.5000లకు పెంచుతూ జీవో విడుదల చేసింది. మార్చి 1 నుంచి పెంచిన పెన్షన్ పంపిణీ చేయనుంది.
ఏపీ రాజధానిలో భూమి లేని నిరుపేదలను పెన్షన్ పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.2500గా ఉన్న పెన్షన్‌ను రూ.5000లకు పెంచుతూ జీవో విడుదల చేసింది. మార్చి 1 నుంచి పెంచిన పెన్షన్ పంపిణీ చేయనుంది.
తాను సీఎం జగన్‌పై అలిగానని.. త్వరలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు మాజీ మంత్రి బాలినేని. తాను వైసీపీలోనే కొనసాగుతునని అన్నారు. కావాలనే కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో ఈ నెల 26న చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం కెనాల్‌కు నీటిని విడుదల చేయనున్నారు.
ఏపీలో టెట్, టీఆర్టీ పరీక్షలు నిలిపివేయాలని అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. దీనిపై జోక్యం చేసుకోలేమని.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ నెల 27లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.
సీఎం జగన్ ఒంగోలు పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 23న ఆయన ఒంగోలులో పర్యటించనున్నారు. ఒంగోలు నగర పరిధిలోని నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
తిరిగి వైసీపీలో చేరిన MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌ను తిట్టమని కాంగ్రెస్ తనను ఆదేశించినట్లు పేర్కొన్నారు. జగన్ తనను రెండు సార్లు ఎమ్మెల్యే చేశారన్నారు. జగన్‌ను తిట్టడం తనకు ఇష్టంలేక తిరిగి వైసీపీలో చేరినట్లు తెలిపారు.
నెల్లిమర్లలో నిర్వహించిన శంఖారావం సభలో సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ లోకేష్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఆయన ట్విట్టర్లో.."నాలుక మడత పడకుండా చూసుకో బాబూ లోకేష్!, కుర్చీ సంగతి తరువాత!" అంటూ ట్వీట్ చేశారు.
టీడీపీ, జనసేన కార్యకర్తలపై జోలికి వస్తే ఊరుకునేది లేదని అన్నారు లోకేష్. మీరు చొక్కాలు మడతపెడితే, మేం కుర్చీలు మడతపెట్టడమే అని సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. రాజధాని ఫైల్స్ సినిమా అంటే సీఎం జగన్‌కు భయం అని అన్నారు.
పట్టాలు ఇచ్చేందుకు తాను ఒక్కో రైతు నుంచి రూ.8లక్షలు తీసుకున్నట్లు కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే బాలినేని అన్నారు. అలా చేసినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.