Job Notification : నిరుద్యోగులకో శుభవార్త..కొత్త జాబ్ నోటిఫికేషన్ విడుదల
చాలాకాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర హైకోర్టులో ఖాళీగా ఉన్న39 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
చాలాకాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర హైకోర్టులో ఖాళీగా ఉన్న39 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గుంటూరులోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 94 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 7, 10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 30,2023.
ఏపీలో ఈ నెల 19న నంద్యాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటనలో పేర్కొంది. ఈ జాబ్ మేళా ద్వారా వివిధ ప్రైవేట్ సంస్థల్లో మొత్తం 750 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో 76 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కాంట్రాక్ట్ విధానంలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనుండగా ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్ 15వరకూ అప్లై చేసుకోవాలి.
పల్నాడు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో 31ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతోపాటు పనిచేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఈ నెలాఖరులోపు గ్రూప్- 1లో 100, గ్రూప్ 2లో 900 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. 3,282 ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఉన్న 18 యూనివర్సిటిల్లో మొత్తం 3, 282 అధ్యాపక పోస్టుల భర్తీకి అక్టోబర్ 20న ప్రకటన వెలువరిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కే. హేమచంద్రారెడ్డి తెలిపారు. వీటితోపాటు మరో 70 పోస్టులను డిప్యుటేషన్ పై తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఏపీలో ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలు పూర్తయ్యాయి. పేపర్ 3,4 పరీక్షల ప్రశ్నపత్రాలతో సహా.. ప్రాథమిక కీ లను ఏపీ ఎస్ఎల్పీఆర్బీ (APSLPRB) విడుదల చేసింది. అలాగే సమాధానాలకు సంబంధించి అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ 18 సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత ఫార్మాట్లో మెయిల్‌కు పంపాలని తెలిపింది. ప్రశ్నా పత్రాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
ఏపీలో త్వరలో టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ముందు టెట్, ఆ తర్వాత డీఎస్సీ ఉంటుందని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు బొత్స.