Chandrababu : చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై హైకోర్టు నుంచి కీలక అప్డేట్..!!
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది న్యాయస్థానం.
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది న్యాయస్థానం.
ఏపీ హైకోర్టులో చంద్రబాబు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుకు కంటి ఆపరేషన్ చేయాల్సిన అవసరం వారు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ బెయిల్ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని వారు కోరారు.
రామోజీరావుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. చీరాల, విశాఖ, సీతంపేట బ్రాంచ్ల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలన్న సీఐడీ పిటిషన్ ను సస్పెండ్ చేసింది.
ఏపీలో ఎస్ఐ నియామకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ప్రభుత్వం నిబంధనలు పాటించని కారణంగా అనేక మంది అభ్యర్థులు అర్హత కోల్పోయారని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే పరీక్షలను తత్కాలికంగా వాయిదా వేయాలని కోరారు. అయితే.. ఈ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం. దీంతో కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు న్యాయవాదులకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది . వీరీలో 1) శ్రీ హరినాథ్ నూనెపల్లి, 2) శ్రీమతి. కిరణ్మయీ మండవ @ కిరణ్మయీ కనపర్తి, 3) శ్రీమతి. సుమతీ జగడం, మరియు 4) శ్రీ న్యాపతి విజయ్ ఉన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏపీ మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ రేపు సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. సీఐడీ తనకు ఇచ్చిన నోటీసులను క్వాష్ చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఆయన న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరిచింది.
చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన అల్లర్లపై నేడు ఏపీ హై కోర్టులో విచారణ జరగనుంది. పుంగనూరు అల్లర్లలో టీడీపీ నేతలు అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ భుమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ దమ్మలపాటి రమేష్ తో పాటు మరికొందరు టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి..తమపై నమోదు అయిన కేసులపై ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారించనుంది.