AP: జనసేనకు పోతిన మహేష్ గుడ్‌బై
జనసేన పార్టీలో అతి ముఖ్యమైన నేతగా ఉన్న పోతిన మహేష్ ఈరోజు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తన రాజీనామా లేఖను అధినేత పవన్ కల్యాణ్‌కు పంపించారు. ఆశించిన టికెట్ రాకపోవడంతోనే మహేష్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
జనసేన పార్టీలో అతి ముఖ్యమైన నేతగా ఉన్న పోతిన మహేష్ ఈరోజు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తన రాజీనామా లేఖను అధినేత పవన్ కల్యాణ్‌కు పంపించారు. ఆశించిన టికెట్ రాకపోవడంతోనే మహేష్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల ముందు వైసీపీకి మరో పెద్ద షాక్ తగలనుందని తెలుస్తోంది. అనుకున్నట్టుగానే దర్శి ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణుగోపాల్ పార్టీని వీడి వెళ్ళనున్నారని సమాచారం. జగన్ బస్సు యాత్రకు ఆయన, తమ్ముడు శ్రీధర్ అందుకే డుమ్మా కొట్టారని అంటున్నారు.
ఏపీలో ప్రచారానికి సీఎం రేవంత్‌ని ఆహ్వానిస్తామని అన్నారు కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆస్తులకు మాత్రమే జగన్ వారసుడని.. వైఎస్ ఆశయాలకు మేమే వారసులం అని అన్నారు.
అనకాపల్లి పర్యటనలో సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్. అమ్మఒడి పథకం కింద అమ్మలకు రూ.19,600 కోట్లు ఇచ్చి.. మద్యం మీద నాన్నల దగ్గరి నుంచి లక్ష కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. జగన్ ముఖ్యమంత్రి కాదు..మద్యం వ్యాపారిలా మారారని ఎద్దేవా చేశారు.
పామరు గడ్డమీద టీడీపీ జెండా ఎగురుతుందన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి వర్ల కుమార్ రాజా. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామని..ఈ సారి ఖచ్చితంగా పామర్రు టీడీపీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాగళం సభలో చంద్రబాబు వెర్షన్ 2.0 చూస్తారన్నారు.
ఏలూరు జిల్లా దెందులూరులో టీడీపీకి షాక్ తగిలింది. తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో దెందులూరు నియోజకవర్గ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ కీలక నేతలు వైసీపీలో చేరారు.
ఏపీ సీఎం జగన్ కు షాక్ ఇచ్చింది ఈసీ. ఇటీవల నిర్వహించిన సిద్ధం సభల్లో చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుకు స్పందించిన ఈసీ జగన్ కు నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఈసీ పేర్కొంది.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా తన గెలుపు ఖాయమని బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన పథకాలే తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో APSRTC కార్గో సర్వీస్ లో నగదు లభ్యమైంది. హైదరాబాద్ నుంచి జంగారెడ్డి గూడెంకు ఆర్టీసీ కార్గో ద్వారా రూ. 22 లక్షల నగదు తరలించినట్లు తెలుస్తోంది. ఆ నగదును సీజ్ చేసి ట్రెజరీకు పంపినట్లు డిఎస్పీ రవిచంద్ర వెల్లడించారు.