CBN : తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!
మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా..అయితే ఈ శుభవార్త మీకోసమే... ఏపీ ప్రభుత్వం జులై నెల నుంచి రేషన్ కార్డు దారులకు బియ్యంతో పాటు పంచదార, కందిపప్పును కూడా అందించనున్నట్లు సమాచారం..
మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా..అయితే ఈ శుభవార్త మీకోసమే... ఏపీ ప్రభుత్వం జులై నెల నుంచి రేషన్ కార్డు దారులకు బియ్యంతో పాటు పంచదార, కందిపప్పును కూడా అందించనున్నట్లు సమాచారం..
ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 24 నుంచి 26 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 24న ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఏపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేశానని రాఘవరావు స్పష్టం చేశారు.
AP: చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వానికి లాయల్టీగా ఉన్న అధికారులపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. తాజాగా ఐఏఏస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పై వేటు వేసింది బాబు సర్కార్. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పోలా భాస్కర్ ను నియమించింది .
ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించడానికి ఈరోజు వెళ్లనున్నారు. ఆయన ఉదయం 11 గంటలకు పోలవరం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రాజెక్ట్ సందర్శిస్తారు. 2 గంటలకు పనులపై అధికారులతో సమీక్ష విలేకరుల సమావేశం ఉంటుంది. 4 గంటలకు అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పోలా భాస్కర్‌ను నియమిస్తూ ఏపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న శ్యామలరావును టీటీడీ ఈవోగా నియమించింది.
నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు.పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి నామినేటెడ్ పదవులిస్తామని ఆయన తెలిపారు. కింది స్థాయి నుంచి పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు దక్కేలా..కార్యకర్తల రుణం తీర్చుకుంటానని బాబు తెలిపారు.
AP: మంగళగిరి ప్రజల కోసం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. లోకేష్‌ను కలిసి జనాలు వారి సమస్యలు చెప్పుకుంటున్నారు.వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కారిస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.
కువైట్ ఘోర అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాల వారికి 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మొత్తం 45 మంది చనిపోగా అందులో ముగ్గురు ఏపీవాసులు ఉన్నారు. కువైట్ నుంచి మృతదేహాలు స్వంత రాష్ట్రాలకు చేరుకున్నాయి.