13వ గేటు వరకు హక్కు ఏపీదే..తగ్గేదేలే: మంత్రి అంబటి.!
సాగర్ కుడి కెనాల్‌ను తెలంగాణ ఆపరేట్ చేయడం చట్టవిరుద్ధమన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఏపీ వాటా నీటిని విడుదల చేయాలన్నా తెలంగాణ పర్మిషన్ తీసుకోవాలా అని ప్రశ్నించారు. 13వ గేటు వరకు హక్కు ఏపీదేనన్నారు.
సాగర్ కుడి కెనాల్‌ను తెలంగాణ ఆపరేట్ చేయడం చట్టవిరుద్ధమన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఏపీ వాటా నీటిని విడుదల చేయాలన్నా తెలంగాణ పర్మిషన్ తీసుకోవాలా అని ప్రశ్నించారు. 13వ గేటు వరకు హక్కు ఏపీదేనన్నారు.
కాకినాడ తీరంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వేటకు వెళ్తున్న మత్య్సకారుల బోటులో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు బోటు మొత్తం అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది11 మందిని సురక్షింతంగా ఒడ్డుకు చేర్చారు.
అల్లూరి జిల్లా ఎల్లవరంలో ఎరక్కపోయి ఇరుక్కుపోయింది చిరుత పులి. కోతుల కోసం ఏర్పాటు చేసిన వలలో చిక్కుకుంది. చెట్టువద్ద వేలాడుతున్న చిరుత పులిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అటవీశాఖ అధికారులు.
నాగార్జున సాగర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇప్పటికే 13 గేట్లు స్వాధీనం చేసుకున్న ఏపీ అధికారులు.. కుడి కాలువ నుంచి నీరు వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు..అయితే, మోటార్లకు కరెంట్ నిలిపివేశారు తెలంగాణ అధికారులు.
నర్సీపట్నం NTR ప్రభుత్వ ఆసుపత్రి తీరుపై మండిపడ్డారు టీడీపీ నేత చింతకాయల విజయ్. చీకట్లోనే సర్జరీలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏరియా ఆస్పత్రిపై రివ్యూ చేయాల్సిన ఎమ్మెల్యే.. ఉడిపి హోటల్లో సాంబారు ఇడ్లీ తింటూ ఆసుపత్రిని నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
నారా లోకేష్ పై కౌంటర్లు వేశారు ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ కుమార్. లోకేష్ ను అందరూ పప్పు పప్పు అని ఎందుకంటున్నారో తనకు ఇప్పుడు అర్థమయిందన్నారు. యువగళం పాదయాత్రలో పట్టుమని ఐదు వందలమంది జనం కూడా లేరు అటువంటి పాదయాత్ర మేము అపడం అనేది హాస్యాస్పదమన్నారు.
చిత్తూరు జిల్లా దాసుకుప్పంలో సర్పంచ్ అవినీతి భాగోతం బయటపడింది. ఇంటి నిర్మాణానికి పంచాయితీ అప్రూవల్ కోసం రూ. 3 లక్షల లంచం తీసుకున్నాడని సర్పంచ్‌పై నవీన్‌కుమార్ ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా, ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో బాధితుడు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నవారు 16 లక్షల వరకూ ఉన్నారని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. రెండు చోట్ల ఓటు ఉన్న వారిని ఒకే చోటకు పరిమితం చేయాలని మంత్రి జోగి రమేష్‌తో కలిసి ఈసీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో వేయకుండా చూడాలని కోరారు.