సర్పంచ్ అవినీతి భాగోతం బయటపెట్టిన బాధితుడు.!

చిత్తూరు జిల్లా దాసుకుప్పంలో సర్పంచ్ అవినీతి భాగోతం బయటపడింది. ఇంటి నిర్మాణానికి పంచాయితీ అప్రూవల్ కోసం రూ. 3 లక్షల లంచం తీసుకున్నాడని సర్పంచ్‌పై నవీన్‌కుమార్‌ ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా, ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో బాధితుడు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

New Update
సర్పంచ్ అవినీతి భాగోతం బయటపెట్టిన బాధితుడు.!

Sarpanch corruption: ఇంటి నిర్మాణానికి పంచాయితీ అప్రూల్ కొరకు సర్పంచ్ రూ. 3 లక్షల లంచం తీసుకున్నాడంటూ ఓ భాదితుడు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో సర్పంచ్ అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని దాసుకుప్పం గ్రామ పంచాయితీలో సుందరం కుమారుడు నవీన్ కుమార్ ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశాడు. అక్కడ ఇంటి నిర్మాణానికి పంచాయితీ అప్రూవల్ కోసం సర్పంచ్ రవి రెడ్డిని కలిశాడు. అయితే, ఆ సర్పంచ్ తనకు సరైన సమాధానం చెప్పకుండా కొన్నాళ్లు తిప్పించుకుని కొంత మొత్తల్లో ఫోన్ పే ద్వారా ఇప్పించుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు రూ 3 లక్షల వరకు లంచం తీసుకున్నాడని భాదితుడు వాపోయాడు.

Also Read: తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో వేయకుండా చూడాలి.!

అంతే కాకుండా బిల్డింగ్ ప్లాన్, కుళాయి, విద్యుత్ కనెక్షన్ కు అనుమతి కావాలంటే ఇంకా కాస్తా నగదు ఇవ్వాలని సర్పంచ్ రవి రెడ్డి ఇబ్బందులుకు గురిచేస్తున్నాడట. ఓపిక నశించిన భాదితుడు నవీన్ కుమార్.. సర్పంచ్ రవి రెడ్డిపై ఎంపిడివో, జిల్లా కలెక్టర్ లకు ఫిర్యాదు చేశాడు. అవినీతి సర్పంచ్ పై చర్యలు చేపట్టి, తమకు న్యాయం చేయాలని అధికారులను కోరాడు. కాగా దాసుకుప్పం సర్పంచ్ రవి రెడ్డి, స్థానిక జడ్పీటీసికి సమీప బంధువు కావడంతో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరీ జిల్లా అధికారులు సర్పంచ్ వ్యవహార శైలిపై ఏవిధమైన చర్యలు చేపడతారో వేచి చూడాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు