తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో వేయకుండా చూడాలి.! రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నవారు 16 లక్షల వరకూ ఉన్నారని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. రెండు చోట్ల ఓటు ఉన్న వారిని ఒకే చోటకు పరిమితం చేయాలని మంత్రి జోగి రమేష్‌తో కలిసి ఈసీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో వేయకుండా చూడాలని కోరారు. By Jyoshna Sappogula 29 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి YCP ministers met Election Commissioner: ఎలక్షన్ కమిషనర్ ముకేష్ కుమార్ మీనాని కలిశారు వైసీపీ మంత్రులు జోగి రమేష్, మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ అప్పి రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు. దొంగ ఓట్లు తొలగించడం, ఓటర్ల జాబితాలో అవకతవకలు గురించి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణలో రెండు చోట్ల 16 లక్షల ఓట్లు ఉన్నాయని తెలిపారు. అయితే, రెండు చోట్ల ఓటు ఉన్న వారిని ఒకే చోటకు పరిమితం చేయాలని ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. తెలంగాణ ఎన్నికలు అయిపోయిన వెంటనే అక్కడ ఓటు క్యాన్సిల్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో ఓటు నమోదు చేసుకోవాలని కొందరు చూస్తున్నారని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే చనిపోయిన, విదేశాలలో ఉన్న వారికి ఇక్కడ ఓట్లు ఉన్నాయని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను ఎలక్షన్ కమిషనర్ కు ఇచ్చినట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనం కోసం ఒకే చోట ఒకే ఓటు ఉండాలనేదే వైసీపీ సిద్ధాంతమని అన్నారు. Also Read: మళ్లీ అధికారం మాదే.. కొడంగల్, హుజూరాబాద్ లోనూ గెలుస్తున్నాం: కేటీఆర్ సంచలన లెక్కలివే! మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ..తెలంగాణలో ఓటు వేసిన వారికి ఏపీలోనూ ఓటు వేసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో ఓటు వేసిన తర్వాత అక్కడ రద్దు చేసుకుని ఇక్కడ ఓటు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇలా ఉన్న ఓట్లపైనే తాము ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. తెలంగాణలో ఓటు వేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఓటు వేసే ప్రయత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలనే ఫిర్యాదు చేసామన్నారు. ఏపీలో లక్షలు ఓట్లు నమోదు చేయాలనీ టీడీపీ, జనసేన పార్టీలు చూస్తున్నాయని ఆరోపించారు. టీడీపీ ఓడిపోతుందని తెలిసి ముందుగానే.. అధికార పార్టీ దొంగ ఓట్లు సృష్టిస్తోందని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కు దమ్ముంటే ప్రజా క్షేత్రంలో యుద్ధం చేయాలని సవాల్ విసిరారు. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి