లోకేష్ ను పప్పు అని ఎందుకంటున్నారో ఇప్పుడే అర్థమయింది: వైసీపీ ఎమ్మెల్యే

నారా లోకేష్ పై కౌంటర్లు వేశారు ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ కుమార్. లోకేష్ ను అందరూ పప్పు పప్పు అని ఎందుకంటున్నారో తనకు ఇప్పుడు అర్థమయిందన్నారు. యువగళం పాదయాత్రలో పట్టుమని ఐదు వందలమంది జనం కూడా లేరు అటువంటి పాదయాత్ర మేము అపడం అనేది హాస్యాస్పదమన్నారు.

New Update
లోకేష్ ను పప్పు అని ఎందుకంటున్నారో ఇప్పుడే అర్థమయింది: వైసీపీ ఎమ్మెల్యే

Mummidivaram MLA Ponnada Satish Kumar: ముమ్మిడివరం యువగళం పాదయాత్ర బహిరంగ సభలో కలెక్షన్ కుమార్ అని లోకేష్ చేసిన అవినీతి ఆరోపణలపై స్పందించారు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్. ఈ సందర్భంగా నారా లోకేష్ పై కౌంటర్లు వేశారు. యువగళం పాదయాత్రలో పట్టుమని ఐదు వందలమంది జనం కూడా లేరు  అటువంటి పాదయాత్ర తాము అపడం అనేది హాస్యాస్పదమన్నారు. జనంలేక బహిరంగ సభలు పెట్టాలని కూడా చూడటంలేదని ఎద్దెవ చేశారు.

రాష్ట్రాని 14సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లోకేష్ వంటి పప్పు కుమారుడు పుట్టాడని బాధపడుతుంటా అని కామెంట్స్ చేశారు. లోకేష్ ను అందరూ పప్పు పప్పు అని ఎందుకంటున్నారో తనకు ఇప్పుడు అర్థమయిందన్నారు. అయితే, తనపై ఎలాంటి అవినీతి ఆదారాలు లేకుండా ఎవరో చెప్పిన ఆరోపణలు విని లోకేష్ మాట్లాడటం సరికాదని సూచించారు. నాలుగు వందల కోట్లు అవినీతి అంటే ఎవరైనా నమ్ముతారా..? ఎవరు చేయలేని విదంగా ONGC మత్స్యకారులు నష్టపరిహారం అనేది DPT ద్వారా వాళ్ళకి అందించానని తెలిపారు.

Also Read: మీ ఓటు ఏ బూత్ లో ఉంది? పోలింగ్ స్టేషన్ ఎక్కడ?.. ఒక్క క్లిక్ తో తెలుసుకోండిలా!

ముమ్మిడివరం నియోజకవర్గంలోని మత్స్యకారుల గ్రామాల్లో తిరిగి నేను ఒక్కరూపాయి అవినీతికి పాల్పడ్డారని నిరుపించగలిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. నా నియోజకవర్గంలో 90 కోట్ల ఇళ్ళ స్థలాలు కొనుగోలు చేస్తే..4 వందల కోట్ల అవినీతి జరిగిందని చెప్పుతున్నారని మండిపడ్డారు. రాష్టానికి లోకేష్ ను సీఎం చెయ్యాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారని అన్నారు. అయితే, చంద్రబాబు నాయుడు వారసులుగా ఒక సీఎం క్యాడింట్ గా ఎదగాలంటే వాస్తవాలు గ్రహించి మాట్లాడటం నేర్చుకోవాలని సూచించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు