ఆసుపత్రిలో చీకట్లోనే సర్జరీలు చేస్తున్నారు.! ఎక్కడో తెలుసా.? నర్సీపట్నం NTR ప్రభుత్వ ఆసుపత్రి తీరుపై మండిపడ్డారు టీడీపీ నేత చింతకాయల విజయ్. చీకట్లోనే సర్జరీలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏరియా ఆస్పత్రిపై రివ్యూ చేయాల్సిన ఎమ్మెల్యే.. ఉడిపి హోటల్లో సాంబారు ఇడ్లీ తింటూ ఆసుపత్రిని నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. By Jyoshna Sappogula 29 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి TDP Chintakayala Vijay: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం NTR ప్రభుత్వ ఆసుపత్రి తీరుపై మండిపడ్డారు టీడీపీ రాష్ట్ర ప్రథాన కార్యదర్శి చింతకాయల విజయ్. ఏరియా ఆస్పత్రిలో వారం రోజుల క్రితం కాలి గాయంతో చేరిన వ్రుద్ధురాలికి వైద్యం అందించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకట్లోనే సర్జరీలు చేస్తున్నారని పలు పత్రికల్లో వార్తలు వచ్చినప్పట్టికి ఆసుపత్రి అధికారులు కానీ ఎమ్మెల్యే గాని స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. ఏరియా ఆస్పత్రిపై రివ్యూ చేయాల్సిన ఎమ్మెల్యే.. ఉడిపి హోటల్లో సాంబారు ఇడ్లీ తింటూ ఆసుపత్రిని నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. Also read: చిరంజీవి, రాంచరణ్, ఎన్టీఆర్ తోపాటు మన హీరోలు ఎక్కడ ఓటు వేయనున్నారో తెలుసా? నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఆర్ధోపెడిక్ డాక్టర్ వారం రోజులుగా రాలేదని.. దానికి ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లును ఆసుపత్రి వైద్యాధికారులు చేపట్టలేదని విచారం వ్యక్తం చేశారు. పేషెంట్ కు రక్తం తక్కువగా ఉందనే నెపంతో వైద్యం అందించక కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు.పేషెంట్లకు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అందిస్తున్నారని ఆ టాబ్లెట్స్ వారు అధికంగా వాడటం వల్ల వారి కిడ్నీలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఎక్స్ రే రిపోర్టులు తీసేందుకు మిషన్ లేదు.. జనరేటర్ కు డిజిల్ ఉండదని ఫైర్ అయ్యారు. ఆసుపత్రిని ఇటువంటి దుస్థితికి దిగజార్చేశారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రిని నిర్లక్ష్యం చేయడం వల్ల రోగులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి