Andhra Pradesh : వామ్మో..ఏపీకి ముంచుకొస్తున్న మరో వానగండం!

ఆంధ్ర ప్రదేశ్‌ కు మరో వానగండం వార్తని వాతావరణశాఖ మోసుకొచ్చింది. మరో వారం రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు.

author-image
By Bhavana
New Update
ap rains

Andhra Pradesh :

తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే వరదల నుంచి కొంచెం కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో మరో వానగండం వార్తని వాతావరణశాఖ మోసుకొచ్చింది. మరో వారం రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఏపీ ఐపు కదిలే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 

Also Read :  పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చాం.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

మళ్లీ వానలు...

దీంతో ఉత్తర కోస్తాకు సమీపంగా రుతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో పాటు. ఈ సీజన్‌లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో సెప్టెంబరు చివరి వారంలో మళ్లీ వానలు పడే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు.

ఇప్పటికే బుడమేరు వాగు పొంగడంతో విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలు వరదలో జనజీవనం అస్తవ్యస్తం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే జనం వరద గుప్పిట నుంచి కొద్దిగా బయటకు వస్తున్నారు. వరదల వల్ల ఇంట్లో ఎన్నో విలువైన వస్తువులు, సర్టిఫికేట్లు, బట్టలు నీటి పాలయ్యాయి. దీంతో ప్రజలకు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. మరోవైపు టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ వరదల కారణంగా పనికిరాకుండా పోయాయి.

Also Read :  ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం

నడిరోడ్డు మీద

వరదల కారణంగా చాలా మంది ప్రజలు కట్టుకున్న బట్టలు తప్ప మరేమి లేకుండా నడిరోడ్డు మీద నిలబడ్డారు. మొత్తంగా వరదల కారణంగా ఇపుడిపుడే తేరుకుంటున్న ప్రజలకు బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం అంటూ వస్తున్న వార్తలతో బెంబేలెత్తిపోతున్నారు.

శుక్రవారం నాడు అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు , శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణశాఖ తెలిపింది.

Also Read :  కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్‌నాయుడికి మరో కీల‌క ప‌ద‌వి

ఒడిశాలో తీరం దాటిన

మరోవైపు ఉత్తరాంధ్రను వణికించిన వాయుగుండం ఒడిశాలో తీరం దాటిన తరువాత తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. తరువాత వాతావరణం అనుకూలించడంతో మళ్లీ వాయుగుండంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వాయుగుండం ప్రభావంతో రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

ఎగువ రాష్ట్రాల్లో వర్షాల ప్రభావంతో గోదావరి మరింత ఉద్ధృతంగా మారుతుందనే ఆందోళన ముంపు ప్రాంతాల ప్రజల్లో వ్యక్తమవుతోంది.

Also Read :  ఏచూరి జాతీయ స్థాయిలో తెలుగు ఎర్రజెండా..
Advertisment
తాజా కథనాలు