బన్నీతో గురూజీ పాన్ ఇండియా రేంజ్ మూవీ!
త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబో లో త్వరలో సినిమా రాబోతున్నట్లు బన్నీ వాసు ప్రకటించారు. ఆ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందని తెలిపారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబో లో త్వరలో సినిమా రాబోతున్నట్లు బన్నీ వాసు ప్రకటించారు. ఆ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందని తెలిపారు.
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న 'పుష్ప 2' కోసం ఏకంగా రూ.300 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా లాభాల్లోనూ బన్నీకి వాటా ఉందని ఇండస్ట్రీలో చర్చనడుస్తోంది.
సుకుమార్ సంచలనం పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా లెవెల్ లో సృష్టించిన విధ్వంసం గురించి తెలిసిందే. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపానికి జాతీయ అవార్డే తల వంచేసింది. ఇప్పుడు వచ్చే పుష్ప-2 అంతకు మించి ఉంటుంది అంటున్నాడు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్.
'మంగళవారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేషనల్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఆర్. ఎక్స్ ఫేమ్ హీరోయిన్ పాయల్ తో కలిసి పుష్ప మూవీలోని తగ్గేదేలే అనే డైలాగ్ యాక్షన్ చేస్తూ పిక్స్ దిగారు. దీంతో, ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయి హల్ చల్ చేస్తున్నాయి.
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి అమితాబ్ కౌన్ బనే గా కరోడ్ పతి షో లో ప్రస్తావించారు. సినిమా పై , అల్లు అర్జున్ నటన పై ఆయన ప్రశంసలు కురిపించారు.
'ప్రిన్సిపాల్ నుంచి సర్టిఫికెట్లు కూడా తీసుకోని ఇద్దరం పోరంబోకులం ఢిల్లీ వెళ్లి ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నాం' అంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. 'పుష్ప' చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ నేషనల్ అవార్డ్స్ అందుకోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్గా పార్టీ ఇచ్చారు. ఈ ఈవెంట్ లో బన్నీ చేసిన కామెంట్స్ నెట్టంట్లో వైరల్గా మారాయి.
జీవితంలో ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని మనం అనుకుంటాం. కానీ మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా గట్టిగా అనుకోవాలి. అలా అయితేనే అది సాధ్యం అవుతుంది. నాకు అవార్డు రావాలని నాకంటే గట్టిగా దర్శకుడు సుకుమార్ కోరుకున్నాడు. అందుకే నాకు ఈ అవార్డు వచ్చింది. దీని ఎచీవర్ ఎప్పటికీ ఆయనే..నేను కేవలం అచీవ్ మెంట్ మాత్రమే అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు
అల్లు అర్జున్ కు మామ చంద్రశేఖర్ రెడ్డి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్న ఐకాన్ స్టార్ కు భార్య స్నేహ రెడ్డి తండ్రి 'పుష్ప' టీమ్ అందరికి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో అల్లు అరవింద్, అల్లు శిరీష్, అల్లు వెంకట్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఫోటో స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చంద్రశేఖర్ రెడ్డి, రాజకీయ నాయకుడిగానే కాదు, అల్లు అర్జున్ మామగా అందరికీ తెలిసిందే.
అల్లు అర్జున్ కు జాతీయ పురస్కారం రావడంపై సినీ అభిమానులు చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆయనకు మించిన నటులు లేరా? అన్న ప్రశ్న కూడా అక్కడక్కడ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అయితే.. ఇలాంటి వాఖ్యానాలు సరికాదని ప్రముఖ సినీ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ అన్నారు.